కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరో ఇలా ఎన్నో పాత్రలో నటించే తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడిగా కొనసాగిన గిరిబాబుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు పేరు రఘు బాబు కాగా… చిన్న కుమారుడు పేరు బోసు బాబు. పెద్ద కుమారుడు రఘుబాబు వెండితెరపై కామెడీ అనగా విలన్ గా అరంగేట్రం చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగులో విడుదలైన అనంతమైన తెలుగులో విడుదల అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హాస్య నటుడిగా విలన్ గా రఘుబాబు అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అయితే రఘు బాబు కి ఒక తమ్ముడు ఉన్నారు అని… అతను సినీ పరిశ్రమలో హీరోగా పరిచయం అయ్యారు అని చాలా తక్కువ మందికి తెలుసు.

అప్పట్లో హీరో గా వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోవాలని గిరిబాబు చిన్న కుమారుడు బోసు బాబు ఇంద్రజిత్తు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఇంద్రజిత్ సినిమా నెల రోజులు గడిచినా హిట్ టాక్ ని సంపాదించుకోలేక పోయింది. అయితే ఆ సమయంలో చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం సినిమా కూడా విడుదల కావడంతో ఇంద్రజిత్తు సినిమా కి పైసా కూడా రాదని బయ్యర్లు చెప్పి ఆ సినిమాని సగానికి సగం విలువ కట్టే కొనుగోలు చేశారు.

దాంతో గిరి బాబుకి చాలా నష్టం వాటిల్లింది. బోసు బాబు కూడా తన సినిమా భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోయారు. ఆ తర్వాత హిందీలో స్టంట్ మ్యాన్, తెలుగులో చమ్మచక్క సినిమాలో కథానాయకుడిగా కనిపించారు కానీ ఆ సినిమాలేవీ అతనిని హీరోగా నిలబెట్టే లేకపోయాయి. దీంతో వెండితెరకు శాశ్వతంగా దూరమయ్యారు బోసు బాబు. ఆ సమయంలోనే ప్రభాకర్ రెడ్డి సీరియళ్లలో నటిస్తున్నారు… అయన బోసు బాబు ని కూడా సీరియల్ లో నటించమని సలహా ఇచ్చారు. దీంతో సీరియల్లో అరంగేట్రం చేసి తన నటనా ప్రతిభతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు బోసుబాబు. గిరిబాబు దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. అలాంటి ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి కుమారుడై ఉండి కూడా వెండితెరపై రాణించలేకపోయాడు బోసు బాబు.



























