ఇటీవలే “అశ్వద్ధామ” చిత్రంతో ప్రేక్షకుల ముందు వచ్చిన నాగసౌర్య పై తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ జేఏసీ మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేసింది. తాజాగా అశ్వద్ధామ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన కొన్నీ వ్యాఖలపై ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. విషానికి వస్తే… అశ్వద్ధామ ప్రమోషన్స్ కోసం నాగసౌర్య ఒక ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చాడు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్లపై అనుచిత వ్యాఖలు చేసారని, మమ్మల్ని కించపరిచేలా నాగసౌర్య మాట్లాడారని పిర్యాదు చేసారు. కొంత మంది చదువులేని డ్రైవర్లు, మద్యానికి బానిసై నేరాలు చేస్తున్నారంటూ ఆ ఇంటర్వూలో నాగసౌర్య అన్నట్టు కమిషన్ కు వివరించారు. తమను అవమాన పరిచే విదంగా మాట్లాడిన నాగసౌర్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా సాగింది. ఈ చిత్రానికి కథ నాగసౌర్య నే అందించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో నాగసౌర్య మాట్లాడుతూ అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడానికి కారణాలు వివరిస్తూ కొందరు డ్రైవర్లు మద్యం సేవించి మత్తులో అమ్మాయిల ఫై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అదే వారు చదువుకుని ఉంటె ఇలాంటివి చేయడానికి వారికీ భయం ఉండేదని అన్నారు.

కొత్త డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వంలో హీరో నాగ సౌర్య, హీరోయిన్ మెహ్రిన్ కలియికలో వచ్చిన చిత్రం “అశ్వద్ధామ”. ఈ చిత్రం నిన్న జనవరి 31న విడుదలైంది. చలో, నర్తనశాల వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న ఉషా మూల్పూరి నిర్మించారు. “ఐరా క్రియేషన్స్” బ్యానర్ పై ఈ చిత్రం నిన్న 31వ తారీఖున విడుదల చేసారు. ఈ చిత్రంపై కాస్త మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కొంత మంది మాత్రం ఈ చిత్రానికి బాగానే కనెక్ట్ అయ్యారు. చిత్రానికి మంచి ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదల సమయం నుంచి ఈ చిత్రానికి క్రేజ్ బాగానే వచ్చింది. దీనికి తోడు సంక్రాంతి స్పెషల్ అంటూ నాగ సౌర్య బుల్లి తెరపై బాగానే ప్రోగ్రామ్స్ చేసాడు.. ఈ విధంగా తెలుగు ఆడియన్స్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ తీసుకువచ్చాడు నాగ సౌర్య. సొంత బ్యానర్ కావడం వల్ల కాస్త ఎక్కువగానే ప్రమోషన్స్ కోసం కష్టపడ్డాడు. ఈ చిత్రానికి నాగ సౌర్య కథని అందించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here