Conductor Jhansi : ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతిసారి కొత్తవాళ్ళను తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే ఈసారి కూడా పల్సర్ బైక్ అనే జానపద గీతానికి స్టెప్పులతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయింది గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఆమె డాన్స్ కి సంబందించిన వీడియో బాగా పాపులర్ అయింది. ఇక చాలా యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలంటూ బిజీ అయిపోయారు ఝాన్సీ. జెమినీ టీవీ, మా టీవీ ఇలా చాలా ఛానెల్స్ డాన్స్ షోలలో పాల్గొన్న ఝాన్సీ కండక్టర్ గా పని చేస్తూనే తన డాన్స్ ప్రోగ్రామ్స్ ని కూడా చేస్తోంది. శ్రీ దేవి డ్రామా కంపెనీ లో అందరితో కలిసి డాన్స్ చేయడం మంచి అనుభూతిని మిగిల్చిందని చెప్పారు. ఇక ప్రస్తుతం బాగా ఫేమస్ అయిన ఝాన్సీ ఆమె గురువు రమేష్ గారు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ అసలు అవకాశం ఎలా వచ్చింది అనే విషయాలను పంచుకున్నారు.

మల్లెమాల వారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే…
శ్రీదేవి డ్రామా కంపెనీ లో అవకాశం ఎలా వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుతూ సాధారణంగా అమ్మవారి జాతరలకు డాన్స్ చేయడానికి వెళ్తుంటాం. అలా ఒకసారి వెళ్ళినపుడు పల్సర్ బైక్ పాటకు డాన్స్ చేయగా అది యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సాధించింది. ఇక ఆ వీడియో చూసిన శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ నేర్పించే శ్రీను మాస్టర్ కాల్ చేసి పిలిపించారు అలా శ్రీదేవి డ్రామా కంపెనీ లో అవకాశం వచ్చింది. రాను పోను ఛార్జిలను ఇచ్చారు అక్కడ భోజనం పెట్టారు అంటూ అవకాశం రావడం గొప్పవిషయం ఇక రెమ్యూనరేషన్లు వాటి గురించి మాట్లాడకూడదు.

ఇక ఫుడ్డు గురించి చెప్పలంటే ఫుడ్డు బాగా ఉంది శనివారం తప్ప ప్రతిరోజు నాన్ వెజ్ పెడతారు అంటూ ఝాన్సీ చెప్పారు. చాలా చక్కగా మాట్లాడుతారు అందరూ బాగా ట్రీట్ చేస్తారు అంటూ చెప్పారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఒక్కసారిగా వైరల్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇంటికి కూడా వచ్చి అభినందిస్తున్నారు. హోమ్ టూర్ చేస్తామంటూ వస్తున్నారు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు అంటూ చెప్పారు.



























