బద్రి సినిమాతో తెలుగులో సినీ రంగ ప్రవేశం చేసిన నటి రేణు దేశాయ్.. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు సినిమాతో వెండి తెరపై నటిగా అడుగు పెట్టింది. ఈ రోజు (04-12-2021) ఆమె పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ కర్లీ హెయిర్డ్ బ్యూటీ.. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. ఇండి పాప్ సాంగ్స్ లో కూడా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఆమె సినిమాలను నిర్మించడం, దర్శకత్వం వహించడం చేస్తున్నారు.
వీటి కంటే ముందే రెండు చిత్రాలలో పనిచేసింది. పవన్‌తో విడిపోయిన తర్వాత.. రేణు వారి పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణెకు వెళ్లారు. రేణు తన పిల్లలతోనే ఎక్కువగా సమయం కేటాయిస్తోంది. సోషల్ మీడియలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఆమె తమ అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉంది. హీరోయిన్ చేయడం మానేసిన తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను నిర్మాతగా, దర్శకురాలిగా మొదలు పెట్టారు.
ఈ రోజుకు ఆమెకు 40 ఏళ్లు నిండుతాయి. 41వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న రేణు దేశాయ్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బుల్లి తెరమీద పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరో తాజా అప్ డేట్ ఏంటంటే.. త్వరలోనే ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్న టాక్ వినిపిస్తోంది.































