ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు తెలంగాణాలోని ప్రజాప్రతినిధులను కూడా వెంటాడుతోంది. కొందరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బిజెపి మాజీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. తాజాగా కాంగ్రెస్ పార్టి సేనియర్ నేత వి.హనుంతరావు కరోనా బారిన పడ్డారు.

అస్వస్తతకు గురైన ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పరిక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో విహెచ్ ను ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా, మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి కూడా కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో మిగలిన ప్రజాప్రతినిధులకు కరోనా టెన్షన్ పట్టుకుంది.






























