ఏపీ లో కాంగ్రెస్ ఉందో లేదో అన్నట్టుగా ఉంది ఇప్పటి వరకు పరిస్థితి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇదివరకే నియమించిన అధిష్టానం తాజగా ఏపీ పీసీసీ కి 11 ఉపాధ్యక్షులు, 18 ప్రధాన కార్యదర్సులను నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. మరో 29 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు మరో 12 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీను కూడా ఏర్పాటు చేసింది.
అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ చీఫ్ మరియు సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉమన్ చంద్ ను నియమించింది. అయితే తెలంగాణ విడిపోయిన తరువాత గత కొంతకాలంగా పెద్దగా ప్రజలముందుకురాని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రెండు కమిటీలలో కీలక భాద్యలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతూన్నాయి. మరో సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డికి కూడా రెండు కమిటీలలో స్థానం కలిపించనున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.


































