వేతనాల పెంపు, వారానికి ఐదు రోజుల పని దినాలు కావాలి అంటూ ఇది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఫ్ ఇండియా, అల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలం కావడంతో మార్చి 11 నుంచి 13 వరకు మూడురోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి. మర్చి 14, సెకండ్ Satarday, ఆ తరువాతి రోజు ఆదివారం కూడా సెలవు దినం. దీనితో బ్యాంకులు వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే వీటిలో ప్రైవేట్ బ్యాంకుల మాత్రం మినహాయింపు ఉందట. ఐసీఐసీఐ, హెచ్.డి.ఎఫ్.సి వంటి ప్రైవేట్ బ్యాంకులకు ఈ సమ్మెలో మినహాయింపు ఇస్తున్నారు. ఈ బ్యాంకులు వాటి కార్యకలాపాలు యధావిధిగా జరుపుకుంటాయి. మూతపడేది మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులు. అయితే తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఐదేళ్ల కొకసారి సేలరీలూ పెంచాలని, పే స్లిప్స్ పై 20శాతం పెంచాలని యూనియన్లు కోరుతున్నారు. వేతనాల పెంపు కోసం ఎన్ని సార్లు చర్చలు జరిపినా అవి సఫలం కాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు.

అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాదన మాత్రం మరోలా ఉంది. ఇప్పటికే వేతనాలలో 19 శాతం పెంపును అంగీకరిస్తున్నామని, పబ్లిక్ హాలిడేలు ఎక్కువగా ఉన్న దేశంలో ఐదు రోజుల పనిదినములు ఇవ్వడం సాధ్యపడదని, ఒకవేళ ఇస్తే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నదని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఐదు రోజుల సెలవులు ఉన్నందున మీరు కాస్త అప్రత్తమై మీ లావాదేవీలు ఆ తేదీలోపు పూర్తిచేయడమో.. లేక పోస్టుపోన్ చేసుకోవడమో చేస్తే బెటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here