తెలుగు సినిమా దర్శకులలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది ప్రత్యెక స్థానం. అయన ఎందరో స్టార్స్ ను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటూ కొండవీటి రాజా సినిమా తీస్తున సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, నటి సిల్క్ స్మితల మధ్య జరిగిన సంఘటన తెలుసుకుందాం. సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం సిల్క్ స్మిత ను తీసుకున్నారు. అయితే పాట చిత్రీకరణలో భాగంగా సిల్క్ స్మిత సెట్‌లోకి రాగానే రాఘవేంద్రరావు ఆమెను పరిశీలించగా.. సిల్క్ స్మిత తలకూడా సరిగా దువ్వుకోకుండా అప్పుడే నిద్ర లేచినట్టుగా సెట్‌లోకి వచ్చింది. అది గమనించిన దర్శకేంద్రుడు ఆమెను తల సరి చేసుకుని రమ్మని చెప్పారట.

అయితే షూటింగ్ లో రాఘవేంద్రరావు ఎదిచేప్తే అది జరగాల్సిందే. సినిమా విషయంలో అంత పర్టిక్యులర్ గా ఉంటారు ఆయన.. అటువంటిది ఆ సమయంలో ఏమయిందో తెలియదు కానీ సిల్క్ స్మిత ఆయన మాట వినిపించుకోలేదు. పైగా హెయిర్ స్టయిల్ బానే ఉందంటూ వితండవాదం చేసారు. ఆమె ప్రవర్తన నచ్చని రాఘవేంద్రరావు షూటింగ్ తీయడం కోసం ‘నీ ఇష్టం’ అంటూ పాట చిత్రీకరణ మొదలుపెట్టారు. అయితే ఆ పాటలో కొంత భాగం పొగమంచు వాతావరణంలో ప్లాన్ చేసారు దర్శకేంద్రుడు. అందుకోసం సెట్ లో తగిన సెటప్ చేసుకోగా సిల్క్ స్మిత పొగంతా పోయేలా ఫ్యాన్ వేసుకుని అదే ప్రదేశంలో కూర్చోవడంతో పాట చిత్రీకరణకు అంతరాయం కలిగింది.
దీనితో సినిమా నిర్మాత అయిన దేవీ వరప్రసాద్ కు సిల్క్ స్మిత ప్రవర్తన నచ్చలేదు. దీనిపై ఆమెకు నచ్చజెప్పి రెండు రోజులు చూసారూ అయినా సిల్క్ స్మిత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. నిర్మాత దేవీ వరప్రసాద్, దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుకుని సిల్క్ స్మిత ను సినిమా నుండి తొలగించారు. అయితే అప్పటికే పాటలో కొంత భాగం సిల్క్ స్మిత పై చిత్రీకరించడంతో మిగలిన భాగాన్ని జయమాలినితో, అనురాధతో చిత్రీకరించి పాట పూర్తి చేశారు. ఇక ఒకే పాతాలో మెగాస్టార్ చిరంజీవి స్మిత, జయమాలిని, అనురాధల ముగ్గురుతో కలసి డ్యాన్స్ చేయడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.



























