తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు..తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి… రెండేళ్ల క్రితం వికాస్ వాసు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది కలర్స్ స్వాతి. అయితే స్వాతి, వికాస్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారి సంసారం జీవితం సరిగా సాగడం లేదని అందువల్ల వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజగా ఆమె సోషల్ మీడియాలో తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్వాతి విడాకులు తీసుకుంటుందంటూ నెట్టింట గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇందుకోసం హ్యారీపోటర్ సినిమాలోని ఒక డైలాగ్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా వాడేసుకుంది.

డాబి : డాబికి ఎక్కడ ఉండాలో తెలుసు.. దాన్ని కమ్ అండ్ గో రూమ్ అంటారు. లేదా రిక్వైర్మెంట్ రూమ్ అంటారు.
హ్యారీ పోటర్ : ఎందుకు ?
డాబీ : ఎందుకంటే నిజంగా అవసరం ఉన్నవారే ఆ రూమ్ లోకి అడుగుపెట్టగలరు. అయితే కొన్ని సార్లు అది ఉండొచ్చు.. కొన్ని సార్లు ఉండకపోవచ్చు. అయితే అన్వేషించిన వారి కోసం అవి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. అంటూ రాసుకొచ్చింది.
దీనితో పాటు ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. 2012 నుంచి తన ఫోటోలు ఆర్కివ్ లో దాచి పెట్టానంటూ స్క్రోల్ చేసి మరీ పాత ఫోటోలు చూపించింది. మొత్తానికి హ్యారీ పోటర్ మ్యాజిక్ చూపించి తన తాజా పోస్టుతో సోషల్ మీడియాలో తన విడాకులపై వస్తున్నా వార్తలకు చెక్ పెట్టింది. మళ్ళీ ఇటువంటి వార్తలు వస్తే ఏ సినిమా చూపిస్తాదో.. అని అనుకుంటున్నారు.




























