తెలుగు టెలివిజన్ షోలలో అత్యంత విజయవంతమైన షో బిగ్‌బాస్. ఈ బిగ్ బాస్ షో ఇప్పటి వరకు మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తెలుగులో బిగ్ బాస్ ధాటికి కొన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. అంతగా ప్రజాదరణ పొందిన షో ఇది. అయితే నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నద్దమవుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే కొందరు కంటెస్టెంట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిలో పలువురు సెలేబ్రేటిల పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా తరుణ్, నందు, సింగర్ సునీత, యాంకర్ ఝూన్సీ, హైపర్ ఆది, మంగ్లీ, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పోయిన సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు నాని, ఎన్టీఆర్‌లు తమ మార్క్ యాంకరింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. అయితే సేజన్ 4 లో హోస్ట్ గా ఎవరు ఉంటారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ నిర్వాహకులు మాత్రం మరోసారి నాగార్జుననే హోస్ట్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈ షో ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఈ వైరస్ ను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని నిపుణులు మొదటినుంచి చెబుతున్నారు. అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వారు అందరు కలిసి ఒకే చోట కొన్ని రోజుల పాటు ఉండవలిసి వస్తుంది. దానికి తోడు బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్ లు ఉండనే ఉన్నాయి. ఇటువంటి షోలో భౌతిక దూరం పాటించడం అనేది చాలా జరిగేపని కాదు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ షోను ఆపివేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. కేవలం తెలుగులోనే కాదు దేశంలోని అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది.. ఒకవేళ అదే జరిగితే బిగ్‌బాస్ నిర్వాహకులతో పాటు ఈ షోను అమితంగా ఇష్టపడే వారికీ షాక్ తగిలినట్లే. కాగా టెలివిజన్‌లోని మిగిలిన షోలు జూన్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

అయితే మరో విషయం ఏమంటే ఈ షో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు నుండి ప్రారంభించేందుకు షో నిర్వాహకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారట.. అయితే ఈ షోపై ఉంటుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.



























