తెలుగు T.v సీరియల్స్‌ అన్నిటిలోనూ ‘కార్తీక దీపం’ సీరియల్ కు వున్న క్రేజ్ వేరు.. ఇప్పుడందరూ ఇదే మాట అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోన్న వంటలక్క సీరియల్‌ను మిస్ చేసుకోవాలంటే అదో వెలతిగా ఫీలైపోతున్నారు మహిళా ప్రేక్షకులు. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు..  చాలా మంది ఇళ్లలోని టీవీల్లో ‘కార్తీక దీపం’ సీరియల్ సంభాషణలు వినబడుతుంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అగ్ర హీరోల సూపర్ హిట్ సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీ పడలేకపోతున్నాయి.

అలాంటి కార్తీక దీపం కోసం ఇటీవలకాలంలో సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు వస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సినిమా షూటింగ్‌ లతో పాటు, సీరియల్ షూటింగ్ లు, వెబ్ సిరీస్ ఇలా అన్నీ కూడా బందైపోయాయి. ఈ నేపథ్యంలో రాత్రి 7.30 అయితే స్టార్ మా‌లో ‘కార్తీకదీపం’ సీరియల్ ప్రసారం కాకపోతే కోట్లాది మంది ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే షూటింగ్‌ చేసిన ఎపిసోడ్స్ ఎక్కువగా లేకపోడంతో ఈమధ్యకాలంలో ‘కార్తీక దీపం’ సీరియల్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతించడంతో ‘కార్తీక దీపం’ సీరియల్ మళ్ళీ బుల్లితెరపై ప్రత్యక్షమైంది. కానీ ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ సీరియల్ పునః ప్రారంభమైన తర్వాత ఊహించని విధంగా సీరియల్ కి ఓ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. IPL, వరల్డ్ కప్ ఇలా ఏ సీజన్ లోనైనా TRP రేటింగ్స్ లో ముందుండే ‘కార్తీక దీపం’  జూన్ 29 నుండి పునః ప్రారంభమై రోజూ ప్రసారమవుతోంది.  ఐతే.. రేటింగ్స్ పరంగా ఎప్పుడు నెం.1 స్ధానంలో వుండే ఈ సీరియల్‌కు గత 2 వారాల నుండి రేటింగ్స్ బాగానే వస్తున్నా.. నెం.1 స్ఠానం మాత్రం దక్కడం లేదు. ఈ 2 వారాలలో ఈ సీరియల్‌ను ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఈటీవీ న్యూస్‌’ తో పాటు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా క్రాస్ చేసిందని సమాచారం.

ఒక్కసారిగా ఈ రేటింగ్స్ ను సమీక్షిస్తే.. ప్రస్తుతానికి ఈ సీరియల్ 3వ స్థానంలో వుందని తెలిసింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. ‘కార్తీక దీపం’ సీరియల్ తన స్ధానాన్ని కోల్పోయినా.. స్టార్ మా ఛానెల్ మాత్రం ఎప్పట్లాగే నెం.1 స్థానంలో వుండటం విశేషం. ‘కార్తీక దీపం’ సీరియల్ ప్రసారమయ్యే టైంలో బుల్లితెరపై మరో ప్రోగ్రామ్ చూడాలంటే మగవాళ్లే  భయపడే పరిస్థితి అందరి ఇళ్లలోను కనబడేది. అంతలా ఈ డైలీ సీరియల్ తెలుగు మహిళా ప్రేక్షకుల హృదయాలలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకుంది. కానీ లాక్ డౌన్ తర్వాత మాత్రం రేటింగ్ లెక్కల్లో తేడాలొచ్చాయి. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్న ఈ సీరియల్.. వీలైనంత త్వరగా మళ్ళీ నెం.1 స్ధానంలోకి రావాలని మహిళా ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here