24 గంటల్లో 1035 పాజిటివ్ కేసులు… దేశంలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి !

0
272

దేశంలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. ఒక పక్క దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్నా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశం మొత్తమ్మీద 1035 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది మృత్యువాత పడ్డారు ఫలితంగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,447 కి చేరింది. వీరిలో డిశ్చార్జి అయినా వారి సంఖ్య ఇప్పటి వరకు 643 మంది. దేశ వ్యాప్తంగా 239 మంది చనిపోయారు.

దీనితో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,565 గా నమోదయింది. ఈ క్రమంలో గత 48 గంటల్లో దేశంలో ఏకంగా 1,487 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు ఎటువంటి పారిస్తుతులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇందుకోసం లక్ష ఐసోలేషన్ బెడ్ లు సిద్ధం చేశామని వెల్లడించారు. కాగా మహారాష్ట్రలో 1666 అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 110 మంది ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల శాక్యుల 487 గా నమోదయింది. ఇందులో 45 మంది కోలుకున్నారు. 12 మంది మృతిచెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here