సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అనగా 2012 జూన్ 14న తన ఉపాసన మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటివాడయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పెళ్లి తర్వాత రామ్ చరణ్ ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటే.. మరోవైపు మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తూ.. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపేస్తోంది ఉపాసన.

అయితే కరోనా లాక్ డౌన్ నేపధ్యంలోఈ మధ్య ఇంటికే పరిమితమైన ఈ జంట సోషల్ మీడియాలో నిత్యం తమ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటున్నారు. చరణ్ – ఉపాసనలు తమ విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. జూన్ 14న రామ్ చరణ్ మరియు ఉపాసనలు పెళ్లి రోజు జరుపుకున్నారు. వారి వివాహ బంధం మొదలై ఎనిమిదేళ్లు పూర్తి అయ్యింది. కానీ ఈ ఏడాది తమ పెళ్లి రోజును వేడుకగా జరుపుకోవడానికి తన మనసు అంగీకరించలేదని అందుకు కారణం ఈ మధ్య అటు వ్యక్తిగతంగానూ.. ఇటు సామాజికంగా అనేక దురదృష్ట సంఘటనలు సంభవించాయని ఉపాసన తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

”గత 20 రోజులుగా కొన్ని కోలుకోలేని సంఘటనలతో తాము చాలా బాధ పడ్డామని, తమ ఫ్యామిలీలోనే ముగ్గురు పెద్ద వాళ్ళను కోల్పోయామని చెప్పారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం, దేశ రక్షణ గా ఉన్న జవాన్ లు చైనా సరిహద్దుల్లో మరణించడం, రోజురోజుకీ కరోనా కేసులు పెరగుతుండటం వంటి ఎన్నో విషయాలు తమ మనసును బాధించాయని, అందుకనే ఈ సంవత్సరం చాలా సింపుల్ గా 3 పచ్చళ్ళతో తమ మ్యారేజ్ డే ను జరుపుకునట్లు ఆమె తెలియజేశారు.



























