దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర లో కేసుల తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఉగాది రోజున మహారాష్ట్ర లోని పాగర్ జిల్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి పట్టణంలో ఆక్సిజన్ కొరత వల్ల 10 మంది కరోనా రోగులు మృతి చెందారని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో మహారాష్ట్ర లోని ఉద్దవ్ థాక్రే సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సరైన చర్యలు తీసుకోకుండా కేవలం లాక్ డౌన్ గురించి మాత్రమె ఉద్ధవ్ ఆలోచిస్తున్నారు అని ప్రతిపక్ష బిజేపే ఆరోపించింది. ఇప్పటికే వాసాయి పట్టణంలో 7000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 3000 మందికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది.



























