ఈ కరోనా నేపధ్యంలో సంవత్సరకాలం విరామం తరువాత పిల్లల చదువులు అటకెక్కాయి. స్కూల్స్ పునఃప్రారంభం తరువాత చాలా మంది పిల్లలు వారు ఇప్పటి వరకు చదివినది అంతా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో మళ్ళి పంజా విసురుతోంది కరోనా మహమ్మారి. ఇటీవలే స్కూల్స్, కాలేజిలు తెరిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది.

పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజగా తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 15 మందికి కరోనా సోకింది. అందులో 12 మంది ఉపాద్యాయులు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్ధి ఉన్నారు. కాగా, మిగలిన వారికి ఎటువంటి లక్షణాలు బయటపడలేదు. మరో వైపు కరీంనగర్ లోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక విధ్యార్దికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ తరుణంలో పిల్లలను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే వాతావరణం కలుగుతుంది.



























