దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు భారీగా విస్తరిస్తుంది. వైరస్ ను కట్టడి చేయడంకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ వైరస్ కు సరైన మెడిసిన్ గాని, వ్యాక్సిన్ గాని లేకపోవడంతో లక్ డౌన్ ఒక్కటే సరైన మార్గం అని కేంద్రం భావించింది. మరో పక్క ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశే లో ఇప్పటికే 329 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను టెస్ట్ చేసేందుకు కొత్త కిట్లను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. విశాఖ మిడ్ టెస్ట్ జోన్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. కేవలం వారం రోజుల్లో ఇక్కడ నుంచి పదివేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒక్కో టెస్టింగ్ కిట్ తో 20 వరకు టెస్టులు చేయొచ్చట. అంతేకాదు త్వరితగతిన అంటే 55 నిమిషాలలోనే ఫలితం వచేస్తుందట. ఇప్పటికే వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ర్యాపిడ్ టెస్టింగ్ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.































