కరోనా మహమ్మారి ప్రపంచమంతా విలయతాండవం చేస్తోంది. మన దేశంలో కూడా దాని ప్రభావం అంతకంతకూ పెరుగుతుంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటుగా సినిమా థియేటర్లు, సినిమా షూటింగ్స్ కూడా వాయిదా పడ్డాయి. అదే క్రమంలో పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ చిత్రానికి “ఫైటర్”, “లైగర్” అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ మంచి యాక్షన్ సీన్స్ లో కనిపించనున్నాడు. అందుకోసం విజయ్ ఇప్పటికే మంచి ఫిట్ నెస్ సాధించాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా జిమ్ లు అన్ని మూతపడ్డాయి. ఒక వేళ ఎక్కడ అయినా ఉన్నా ఉపయోగించలేని పరిస్థితి.

అయితే ఈ పరిస్థితిని ఊహించి చాలా మంది హీరోలు ఇంట్లోనే జిమ్ లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పాపం విజయ్ దేవరకొండ మాత్రం ఇంట్లో జిమ్ సెటప్ చేసుకోలేదట. దీనివల్ల వర్కవుట్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడట. సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు ఫిట్ నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది. దీనితో ఎమీ చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడట విజయ్ దేవరకొండ. ఇక విజయ్ ఫిట్ నెస్ లో తేడా వస్తే షూటింగ్ కూడా మరికొద్దిరోజులు వాయిదా పడే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ మొదలయింది.

































