ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భారీ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.. మన దేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి క్రమేపి పెరుగుతుంది. దీనికి సరైన మెడిసిన్ లేకపోవడంతో మరింతగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రజలు కరోనా భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు, గడప దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూణే కి చెందిన ప్రముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండియా కంపెని శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేపనిలో నిమగ్నమయ్యామని, ఈ క్రమంలో ఇతర మందుల తయారీ కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆ సంస్థ తెలిపింది.

త్వరలో కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభిస్తున్నామని తెలిపింది. దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను కేవలం వెయ్యి రూపాయలకు తీసుకురానున్నామని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. మొదటి దశలో 10 మిలియన్ల డోసులు సిద్ధం చేస్తున్నామని అయన చెప్పారు. ఆ తరువాత నెలకు 20 నుంచి 40 మిలియన్ల డోస్ లను తయారు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి 2-4 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించారు. వచ్చే నెలలో మనుషులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వచించున్నట్టు చెప్పారు అదర్ పూనావాలా. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ట్రాల్స్ కోసం వేచిచూడామని తెలిపారు.































