గత సంవత్సరన్నర కాలం పాటు ప్రపంచ దేశాలన్నింటికీ వణికిస్తున్న కరోనా మహమ్మారి మొట్టమొదటిసారిగా చైనాలోని ఊహాన్ ప్రాంతంలో నమోదు కాగా ప్రపంచ దేశాలన్నీ చైనా దేశం పై తప్పుబట్టాయి. కావాలనే చైనా ప్రభుత్వం జీవ ఆయుధాన్ని తయారుచేసే ప్రపంచంపై వదిలిందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పటికీ సార్స్‌కోవ్-2 ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపించింది అనే విషయాల గురించి పరిశోధకులు నిరంతరం అన్వేషణ కొనసాగిస్తున్న ఇప్పటికీ ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు.

తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి ఓ సమాచారాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ దీనికి సంబంధించి ఓ కథనం ప్రచురించింది. వైరస్ విషయం బయటికి రావడానికి ముందే చైనాలోని ఊహన్ ల్యాబ్ లో ముగ్గురు పరిశోధకులు మృత్యువాత పడ్డారని ఈ పత్రిక వెల్లడించింది. అమెరికా ఇంటిలిజెన్స్ నిపుణుల ఆధారంగా కరోనా విషయంలో మరోసారి చైనా పాత్ర బయటపడింది.
ప్రపంచానికి తీవ్ర గందరగోళానికి గురి చేసిన సార్స్ కోవ్-2 వైరస్ వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్‌లో కొంతమంది పరిశోధకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. వీరిలో సాధారణ ఫ్లూ కనిపించే జ్వరం, పొడిదగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని, కరోనా బారిన పడిన వారిలో కూడా ఇదే లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. అయితే వారు ఏవిధంగా మృత్యువాత పడ్డారని విషయం గురించి సరైన ఆధారాలు లేవు.
మొట్టమొదటిసారిగా చైనాలోని తొలి కరోనా వైరస్ కేసు డిసెంబర్ 8,2019న నమోదైంది. కానీ అప్పటికే చైనాలో ఎంతోమంది ఈ వైరస్ బారిన పడినట్లుగా అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు. అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం పై ఇన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ రా డేటా, సేఫ్టీ లాగ్స్, గబ్బిలాల్లోని కరోనావైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను మాత్రం బయటకు ఇవ్వకపోవడంతో చైనా పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.




























