Court orders Selva mani bailable arrest : సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి భర్త సెల్వమణి తమిళ దర్శకుడిగా పేరుంది. అయితే ఈయన పై చెన్నై జార్జ్ టౌన్ కోర్ట్ బెయిలబల్ అరెస్టు వారెంట్ ను జారిచేసింది. ఈ వార్త వైరల్ అయింది.దీంతో ఇపుడు అసలు ఏం జరిగింది ఎందుకు అరెస్టు వారెంట్ జారీ అయిందని చర్చ మొదలయింది.

పరువునష్టం దావా లో కోర్టుకు హాజరు…
2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఇద్దరు ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో వీరిద్దరు ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్ బోద్రా గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. సెల్వమణి, అన్బరసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముకుంద్‌చంద్ బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ముకుంద్ చంద్ బొద్రా మరణం తరువాత తన కుమారుడు గగన్ బొద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. కాగా కేసు మంగళవారం విచారణ కు రాగా సెల్వమణి, అరుళ్ అన్బరసులు కోర్టుకు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలో జార్జిటౌన్ న్యాయమూర్తి వారిద్దిరిపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేశారు.



































