కోవిడ్ 19 నిర్ధారణ కోసం ఇకపై ఆస్పత్రులు, ల్యాబరేటరీల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీరు ఇంట్లోనే మీరే కూర్చొని స్వయంగా మీరే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ‘కోవీసెల్ఫ్’ పేరుతో ఇండియాలోనే మొట్టమొదటి సారిగా కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పూణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ICMR ఆమోదం పొందిన తర్వాత గత నెలలో కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ‘కోవీసెల్ఫ్’ను పరిచయం చేసింది. అయితే ఇక ఇప్పుడు తాజాగా వీటి మొదలు పెట్టింది మైల్యాబ్స్ సంస్థ..

ఇవి దగ్గర్లోని మెడికల్ షాపులో కూడా ‘కోవీసెల్ఫ్’ కొనుక్కోవచ్చు. మరోవైపు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంచారు. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ‘కోవీసెల్ఫ్’ అమ్మకాలు మొదలయ్యాయి. రూ.250 కు ఈ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి మన దేశంలోని 95 శాతం పిన్ కోడ్స్‌కి వీటిని డెలివరీ చేస్తామని మైల్యాబ్ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ‘కోవీసెల్ఫ్’ కిట్స్ డెలివరీ చేస్తామని మైల్యాబ్స్ తెలిపింది..
Thank you all for your patience. We are happy to roll out the first 1 million self-tests today. In next 2-3 days, it should reach at pharmacies near you and you can also buy them on @Flipkart. Authorized selling points available at https://t.co/FR8hrEa24I pic.twitter.com/xf2xZmuDWK
— Mylab Discovery Solutions (@MylabSolutions) June 3, 2021
ఈ ‘కోవిసెల్ఫ్” ఎలా వాడాలో క్రింది విడియోలో చూడండి..



























