Covid cases : కరోనా మహమ్మారి ఈ మధ్య శాంతించిందని మాస్కులు లేకుండా రోడ్లపైకి జనాలు వస్తున్నారు. ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నిబంధనను సడలించింది. దీంతో ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నారు. కానీ మళ్ళీ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు సాధారణ ప్రజలలో పెరుగుతున్నాయి. ఇక సెలబ్రిటీలు దీనికి మినహాయింపు కాదు.
అటు రాజకీయ నాయకులకు, ఇటు సినీ సెలబ్రిటీలకు….

కరోనాకు భేదాభిప్రాయాలు లేవు. చిన్నా పెద్ద తారతమ్యాలు లేవు అందుకే అందరికి సమానంగా వైరస్ ను పంచుతోంది. కరోనా మొదటి, రెండవ వేవ్స్ లో ఎంతోమంది కామన్ జనాలతో పాటు, సెలబ్రిటీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇపుడు మళ్ళీ కరోనా ఎక్కువవుతోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనాపాజిటివ్ వచ్చింది. పలువురు రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లకు కరోనా సోకిందని తెలుస్తోంది. అయితే సెలబ్రిటీలు వారికి కరోనా సోకిన విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
కరణ్ జోహార్ పార్టీలో కరోనా కలకలం….

ఇటీవలే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన 50 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ పార్టీకి బాలీవుడ్ నుండి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, కాజల్, మాధురి దీక్షిత్, జూహీ చావ్లా, రవీనా టండన్, జాన్వీ కపూర్, రణ్ వీర్ సింగ్, దీపికా, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, కృతి సనన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్‌తో పాటు పలువురు పార్టీకి హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో పలువురికి కరోనా సోకిందని తెలుస్తోంది. జూన్ 1 న కత్రినా కైఫ్ కి, జూన్ 4 న కార్తీక్ ఆర్యన్ కు కరోనా సోకినట్లు జీఏంసి అసిస్టెంట్ కమీషనర్ పృథ్వీరాజ్ చౌహన్ వెల్లడించారు. పార్టీ కి హాజరైన వారిలో దాదాపు 55 మందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇక ఈ విషయంపై బాగా విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతిఒక్కరు మాస్క్ పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.



























