త్వరలో పిల్లలపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్.!

0
54

దేశవ్యాప్తంగా త్వరలోనే పిల్లలపై కోవిడ్ వాక్సిన్లు ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్లకు సంబంధించి పలు విషయాలపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. వ్యాక్సిన్ల విషయంలో పిల్లల కోసం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదని వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.

త్వరలోనే పిల్లలపై వ్యాక్సిన్ల ట్రయల్స్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఏ దేశంకూడా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వలేదని గుర్తుచేసింది. పిల్లలకు టీకాలు ఇవ్వాలని WHO కూడా ఎక్కడా సూచించలేదని తెలిపింది. అయినా కూడా మన శాస్త్రవేత్తల పరిశోధనలకు అనుగుణంగా పిల్లలపై టీకా ట్రయల్స్ చేయనున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here