ఏపీలో కోవిడ్ వాలంటీర్లకు నోటిఫికేషన్ విడుదల…!! ముందుకొచ్చిన వారికీ మరో బంపర్ అఫర్ !!

0
494

ప్రస్తుతం కరోనా ప్రపంచవ్యాప్తంగా బీభత్సం సృష్టింతోంది… మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో మన ప్రధాన మంత్రి ముందుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయంతో ఆ ప్రభావం కాస్త తక్కువగానే ఉన్నా.. ఢిల్లీలోని మర్కజ్ సంఘటనతో కేసుల సంఖ్య కాస్త ఆందోళనగా అనిపిస్తుంది. ఈ కరోనా మన తెలుగు రాష్ట్రాలపై కూడా పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలో కరోనాపై యుద్దానికి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనాను ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా వాలంటీర్ల నియామకం చేపట్టబోతున్నట్టు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్ తెలిపారు. వివిధ ఆసుపత్రులలో అదనంగా అవసరమయ్యే వైద్యనిపుణులు, పారా మెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యా వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కార్యక్రమానిని చేపట్టారు. దీనికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో ఉన్న 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేద నర్సింగ్ కాలేజీలు మరియు ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కూడా వాలంటీర్లకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్ గా పని చేసేందుకు ముందుకు రావొచ్చని తెలిపారు. వీరి సేవలను ఆసుపత్రులలో, కోవిడ్ క్వారంటైన్ సెంటర్లలో వినియోగించనున్నట్టు తెలిపారు. మరియు వాలంటీర్ల సేవలను వారు ఎంచుకున్న జిల్లాలోనే వినియోగించుకుంటామని అన్నారు.

ఆసక్తి కలవారు www.health.ap.gov.in/CVPASSAPP/Covid/Volunteerjobs వెబ్సైలో పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. వాలంటీర్లుగా పనిచేసిన వారికి ఏపీ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న రిక్రూట్మెంట్ లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here