Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అనసూయ ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ సినిమా అవకాశాలను అందుకున్నారు. అవకాశాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఇక అనసూయ ఇటీవల కాలంలో సినిమాల పరంగా పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. ఈమె విభిన్న పాత్రలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల అనసూయ నటించిన విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఇలాంటి సాహస భరితమైన పాత్రలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
తాజాగా అనసూయ మరోసారి తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె తల్లి కాబోతుంది అంటే నిజ జీవితంలో తల్లి కాబోతుంది అనుకుంటే మనం పొరపాటు పడినట్టే స్టార్ హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
స్టార్ హీరోకి తల్లిగా..
అనసూయ స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నారని అయితే ఈ సినిమాలో స్టార్ హీరో చిన్నప్పటి పాత్రకు సంబంధించినటువంటి సన్నివేశాలలో తన తల్లిగా అనసూయ కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈమె మరోసారి తల్లి పాత్రలలో నటిస్తూ పెద్ద సాహసమే చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా తల్లి పాత్రలలో నటిస్తే అలాంటి పాత్రలలోనే అవకాశాలు వస్తాయని చాలామంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అనసూయ మాత్రం అలాంటి పాత్రలకు ఒప్పుకొని పెద్ద సాహసమే చేస్తున్నారని తెలుస్తుంది.





























