Cricketer MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఈయన ఒక సంచలనం. ఇండియన్ క్రికెట్ టీం లో ఒకో క్రికెటర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాగే అభిమానులు కోట్లలో ఉంటారు. కానీ ఒక్కసారి మ్యాచ్ లో మంచి ఆట తీరు చూపించకపోతే విమర్శిస్తారు. కానీ ధోని విషయంలో మాత్రం అలా కాదు. కేవలం ధోని ఒక బాల్ అయిన మైదానంలో ఆడితే చూడటానికి వచ్చే అభిమానులు ఎంతో మంది. ఆయన ఒక లివింగ్ లెజెండ్ అనడంలో ఆశ్చర్యం ఏమి లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా ఉన్న ధోని కోసమే ఆ టీం ను చాలా మంది అభిమానిస్తారు. ఇక ఎవరైనా నచ్చితే నెత్తిన పెట్టుకునే తమిళ ప్రజల అభిమానం చూరగోనడం అంత చిన్న విషయం కాదు. ధోని అంటే చెన్నై అనేంతలా అభిమానులను సొంతం చేసుకున్న మహీకి చాలా ఏళ్ల తరువాత ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఐతే ఆ అవార్డు అసలు ఎందుకిచ్చారు అంటూ ధోని ప్రశ్నించడంతో ఇపుడు హాట్ టాపిక్ అయింది.

ఐపీఎల్ అంటేనే కమర్షియల్…. ధోని ఉంటేనే పైసా వసూల్….
తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సిఎస్కే మరియు ఎల్ఎస్జి ల మధ్య జరగగా వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయం నమోదు చేసారు. ఐతే ఈ మ్యాచ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ధోనిని ప్రకటించారు. మ్యాచ్ అయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో మురళి కార్తీక్ ధోనిని చివరగా ఎపుడు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారని ప్రశ్నించారు. ఐతే ధోని దానికి నవ్వుతు అసలు ఇవాళ కూడా ఎందుకు ఇచ్చారు. మా జట్టు లో నూర్ అహమ్మద్ బాగా బౌలింగ్ చేశాడు అతనికి వస్తుందని అనుకున్నాం అంటూ మురళి కార్తికేయన్ ను అడుగగా నీ ఆట సిఎస్కే కి మంచి చేస్తుంది. సిఎస్కే బాగుంటే ఐపిఎల్ బాగున్నట్లే అంటూ సమాధానము చెప్పారు.
మురళి కార్తికేయన్ అలా అనడానికి రెండు కారణాలను కనిపిస్తాయి. ఒకటి ధోని ఒక ఆటగాడిగా తన ప్రదర్శన అలాగే జట్టు కెప్టెన్ గా తాను చేసిన మార్పులు. నిన్న లక్నో తో జరిగిన మ్యాచ్ లో ధోని ఓపెనర్ గా ఉన్న అశ్విన్ ను ఫామ్ లో లేడని పక్కన పెట్టి విదేశీ ఆటగాడైన డేవాన్ కాంవేను పక్కన పెట్టి రషీద్ అనే గుంటూరు కుర్రాడికి ఓపెనర్ గా అవకాశం ఇచ్చాడు. రషీద్ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ధోని వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగుంది. ఆయుష్ బడోని ని స్టంప్ అవుట్ చేయడం, అబ్దుల్ సమద్ ను రన్ అవుట్ చేయడం, పంత్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడం ఫినిషెర్ గా 200 పైగా స్ట్రైక్ రేట్ తో 5 ఓవర్లలో 55 కొట్టి మ్యాచ్ గెలవడంలో తన వంతు కృషి చేశాడు. అలా ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఆరేళ్ళ తరువాత అర్హుడయ్యాడు.



























