CVL Narasimharao : జేడి చక్రవర్తి వల్ల కృష్ణ వంశీ నన్ను అపార్థం చేసుకున్నాడు…: సివిఎల్ నరసింహా రావు

0
56

CVL Narasimharao : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తెలుగు నటుడు నరసింహా రావు గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న వివిధ విషయాల గురించి రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన వృత్తి పరంగా లాయర్ అయినా సినిమాల్లో ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక లాయర్ అయ్యుండి కూడా కొన్నిసార్లు మోసపాయాను డబ్బు విషయంలో, అలాగే ఎదుటివారి ఆలోచన పసిగట్టడంలో మోసపోయాను అంటూ చెప్పారు. వెంకీ, జాతిరత్నాలు, ఠాగూర్, యువసేన వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు.

కృష్ణవంశీ కి నాకు మధ్య అపార్థం వచ్చింది…

రాఖి సినిమా కోసం సీవీఎల్ నరసింహా రావు గారు రచన సహకారం అందించారట. అయితే సినిమాలో ఆయన పేరు వేయలేదు కృష్ణ వంశీ గారు. ఈ విషయం సరదాగా జేడి చక్రవర్తి వద్ద నరసింహా రావు గారు ప్రస్థావించారట. జేడి చక్రవర్తి ఈయన సన్నిహితంగా ఉండటం వల్ల వీళ్ళిద్దరూ కృష్ణ వంశీకి సన్నిహితులు అవడం వల్ల అలా చెప్పడంతో జేడి చక్రవర్తి ఆ విషయం కృష్ణ వంశీకి చెప్పాడట.

అదే సమయంలో రేడియోలో వరకట్నంకి సంబంధించిన సమస్య గురించి ఇంటర్వ్యూ చేయాల్సి రావడంతో కృష్ణ వంశీ అయితే బాగుంటుందని పిలిస్తే అపుడు కృష్ణ వంశీ అసలే సినిమాలోనూ మీ పేరు వేయలేదు ఖచ్చితంగా వస్తాను అంటూ అనడంతో నేనేదో ఊరికే అన్నాను అని చెప్తే, సినిమాలో నేను మీ స్వచ్చంద సంస్థ రక్షా పేరు ఎన్ని సార్లు వాడాను అది మీకోసమే కదా అంటూ కృష్ణ వంశీ చెప్పాడు. మా మధ్య వచ్చిన అపార్థం అంత పెద్దదేమి కాదు అంటూ వివరించారు.