CVL Narasimharao : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తెలుగు నటుడు నరసింహారావు గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న వివిధ విషయాల గురించి రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన వృత్తి పరంగా లాయర్ అయినా సినిమాల్లో ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక లాయర్ గా ఎన్నో కేసులు వాదిస్తూ బాగానే సంపాదించానని, అయితే సినిమాలలో మంచి పాత్రలు వస్తుంటాయి అది నా అదృష్టం అంటూ చెప్తారు నరసింహారావు. వెంకీ, జాతిరత్నాలు, ఠాగూర్, యువసేన, భీమ్లా నాయక్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన రెండు కెరీర్ల గురించి తెలిపారు.

పవన్ లాంటి నాయకుడు అవసరం…
గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా రెండు చోట్లా ఓడిపోయారు. ఆ విషయం గురించి నటుడు నరసింహారావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల మేలు కోసం నిరంతరం తపించే వ్యక్తి. ఈ విషయం బాగా అర్థం అయినవాళ్లే వారు ఆయన్ను వదులుకోరు. కానీ గత ఎన్నికలలో ఆయన ఓడిపోవడం చూసాం అందులోనూ రెండు చోట్లా పోయారు.

అది చూస్తే అలాంటి వ్యక్తికి ఓట్లేయని ప్రజలను ఏమనుకోవాలో తెలియదు. ఈ సారి ఆయన గెలిచి అధికారంలోకి వస్తాడో లేక ఆయన అసెంబ్లీ కి వెళ్తారో తెలియదు కానీ ఆయన అడిగేది అదే, ఒక్కసారి అసెంబ్లీకి పంపండి అని అది ప్రజలు చేస్తే బాగుంటుంది. ఆయన గెలిస్తే ప్రజల కోసం ఏదైనా చేస్తారు అంటూ అభిప్రాయపడ్డారు.