టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది..అయన సినిమాకోసం ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. ట్రెండ్ కి తగ్గట్లు సినిమాలు చేస్తుంటారు వెంకటేష్. సోలో హీరోగా తన ప్రాభల్యం తగ్గిపోతుందని తెలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆధారం అయ్యారు.. టాలీవుడ్ లో ఈ తరం ఈ తరహా సిన్మాలు చేయడానికి ఆద్యం ఆయనే అయ్యారు.. యూత్ ఎక్కువగా ఇష్టపడే అయన సినిమాలు ఇటీవలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు.. కథల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తన వయస్సు కి తగ్గ పాత్రలున్న సినిమాలే ఎంచుకుంటున్నా ఎందుకో ఆ సినిమాలు పెద్దగా ఆడట్లేదు..

రొటీన్ పాత్రలు చేస్తూ వెంకీ బోర్ కొట్టిస్తున్నాడని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఆయనకు F2 తప్పా కమర్షియల్ హిట్ ఏదీ లేదంటే ఆశ్చర్యపోవచ్చు.. తాజగా నారప్ప, F3 సినిమాల్లో నటిస్తున్నారు వెంకటేష్. కాగా సైబర్ క్రైమ్ పోలీసులు తాజగా వెంకీ ని బాగా వాడేస్తున్నారు. ఇంటర్నెట్‌ని విరివిగా వాడుతున్న ఈ కాలంలో ఆన్‌లైన్‌లో మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్ వాడకం తెలియని వారే కాదు.. తెలిసిన వారు సైతం కొన్ని సార్లు మోసపోతున్నారు. వీటిపై అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఏ అవకాశాన్ని వదలట్లేదు. కొంతమంది ప్రముఖులతో వీటిపై అవగాహన వీడియోలు చేసి విడుదల చేస్తున్నారు అలాగే ఈ తరానికి సినిమాలంటే చాలా మందికి ఇష్టం కాబట్టి.. సినిమాల్లోని మీమ్‌లతో వారు అవేర్‌నెస్ కలిగిస్తున్నారు.
ఈ క్రమంలో ఆ మధ్య హాస్యబ్రహ్మ బ్రహ్మానందంను రంగంలోకి దింపిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆయన చేత అవగాహన కలిగించారు. తాజాగా విక్టరీ వెంకటేష్‌ని కూడా రంగంలోకి దింపారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓ వీడియోను చేసి విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
































