ఉచిత వైఫై ఒక కనిపించని ఎర.. దాన్ని వాడితే.. మీకు ఇలాంటి ముప్పులు తప్పవు

0
134

డిజిటలైజేషన్ లో భాగంగా మన రోజూ వారీ కార్యకలాపాలలో టెక్నాలజీ ఉపయోగం ఘననీయంగా పెరిగింది. అయితే టెక్నాలజీతో పాటు దాని యొక్క దుష్ప్రభావాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. “ఇంటర్నెట్” ప్రస్తుతం ఈ పదం తెలియని పిల్లవాడు కూడా ఉండడంటే అతిశయోక్తికాదు. అంతలా మన జీవితాల్లోకి చోచ్చుకుంటూ వచ్చేసింది ఇంటర్నెట్.

ఇక అసలు విషయానికి వస్తే ఇంటర్నెట్ వాడుతున్నామంటే ఖచ్చితంగా మన సమాచారాన్ని చోరీ చేయడానికి ప్రయత్నిస్తారు హ్యాకర్లు. ముఖ్యంగా ఈ హ్యాకర్లు ఉచిత వైఫై వాడే ఫోన్లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఫ్రీ వైఫై, మరియు పబ్లిక్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించే ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఎక్కువగా హ్యాక్ గురవ్తున్నాయి. అందువల్ల ఫ్రీ ఇంటర్నెట్ ఉపయోగించి సోషల్ మీడియా అకౌంట్స్, మనీ లావాదేవీలు జరపడం అస్సలు చేయొద్దు. వీటి ద్వారా ఆయా వ్యక్తుల అకౌంట్స్, పాస్వర్డ్స్ హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎటువంటి అవసరాలకైనా సెక్యూరిటీ కోడ్, సేఫ్టీ ఎక్కువగా వైఫై నెట్‌వర్క్‌లనే ఉపయోగించాలి. ఈ విషయం పై సైబర్ పోలీసులు తరచూ అవగాహన కల్పిస్తున్నా ఇప్పటకీ కొంతమంది ఉచిత వైఫైనే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.. ఈ క్రమంలో ఇటువంటి వారిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వినూత్నంగా ఓ ట్వీట్ చేశారు. ఒక వీడియోను పోస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. “ఉచిత వైఫై ఒక కనిపించని ఏర.. దాన్ని వాడితే.. మీకు ఇలాంటి ముప్పులు తప్పవు” అని క్యాప్షన్ ఇచ్చారు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here