గ్లామర్ డాల్ గా మారిపోయిన డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ !!

0
525

చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమా గుర్తుందా.? అంత ఈజీగా మరిచిపోయే సినిమా కూడా కాదు ఇది. మొత్తం చిరు కెరీర్‌లో ది బెస్ట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఈ మూవీ అప్పట్లో పెద్దగా ఆడకపోయినా కూడా చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది. ఇక అందులో చిరంజీవి తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో పాత్ర చిన్నారి పాప. అక్షయ పాత్రకు ప్రాణం పోసింది ఈ పాప. ద్విపాత్రాభినయం చేసిన ఈ చిన్నారికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది.

చూస్తుండగానే డాడీ సినిమా వచ్చి 20 ఏళ్లైపోతుంది. ఇక అందులో నటించిన ఆ చిన్నారి కూడా ఇప్పుడు హీరోయిన్‌ రేంజ్‌లో ఎదిగిపోయింది. ఇంతకీ ఆమె పేరేంటో తెలుసా.? అనుష్క మల్హోత్రా.. డాడీ చిత్రంలో చిరుతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది అనుష్క. ఇద్దరూ అచ్చంగా తండ్రీ కూతుళ్లే అనిపించారు. కానీ ఎందుకో ఏమో మరి.. డాడీ తర్వాత స్క్రీన్‌పై పెద్దగా కనిపించలేదు అనుష్క. అప్పటి చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ కూడా కుళ్లుకునేంత గ్లామర్ డాల్ గా మారిపోయింది.

ఈమధ్యనే ఈ అమ్మడు విడుదల చేసిన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తళుక్కుమంటూ మెరుస్తున్నాయి. మరి రాబోయేతరంలో ఈ ముద్దుగుమ్మ ఎంతమంది తారలకు పోటీ ఇవ్వనుందో తెరపై చూడాల్సిందే..!👍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here