దగ్గుబాటి అభిరామ్.. కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ స్టార్ హీరో కంటే ఎక్కువ ఇమేజ్ దక్కించుకున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్ – రానా మంచి హీరోలుగా అభిమానుల మనస్సుల్లో స్ధానం సంపాదించుకున్నారు. ఇప్పుడదే పంధాలో వారసత్వాన్ని కొనసాగించేందుకు సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ కూడా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీపై సురేష్ బాబు చర్చలు జరుపుతున్నారు. పలువురు దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల సురేష్ బాబు కొన్ని ప్రేమ కథలను సెర్చ్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

ఆ పనులన్నీ అయిపోగానే దగ్గుబాటి అభిరామ్ మొదటిసినిమాను స్టార్ట్ చేయాలనీ సురేష్ బాబు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా దగ్గుబాటి అభిరామ్ తొలిసారిగా తన టాలీవుడ్ ఎంట్రీ గురించి, అలాగే రానా పెళ్ళి విషయమై మీడియా ప్రతినిధులతో ముచ్చటించాడు. వెండితెరపై హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇస్తానని, ఈ మేరకు కథలు కూడా వింటున్నామని, సురేష్ బాబు గారు ఫైనలైజ్ చేస్తారని పేర్కొన్నాడు. లవ్ స్టోరీ, సమాజానికి సందేశాన్ని ఇచ్చే కథలను చేయాలనుకుంటున్నానని అన్నాడు. అయితే ఈ ఏడాదో వచ్చే ఏడాదో స్పష్టంగా తెలీదు కానీ హీరోగా రావడం కన్ ఫార్మ్ అని ప్రకటించాడు.

అలాగే రానా పెళ్లిపై కామెంట్ చేశాడు. ఆగస్ట్ 8న పెళ్లి అని అనుకుంటున్నామ్ అయితే కరోనా ఎలా ఉంటుందో చెప్పలేం.. దాన్ని బట్టి ఎలా చేయాలని ఎంతమందిని ఆహ్వానించాలో ఇంకా ఏం డిసైడ్ కాలేదని తెలిపాడు.



























