Daggubati venkatesh : ఒక కథ ఒకరికి నచ్చి సినిమా తీయొచ్చు అదే కథ మరో హీరోకి నచ్చక పోయిండొచ్చు ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో మామూలే. అయితే కొన్ని కథలు కొందరు హీలకు నచ్చినా బిజీగా ఉండో మరింకేదో కారణం వల్ల ఆ సినిమా చేయలేక పోవచ్చు. అలా వదులుకున్న సినిమాలు హిట్ అయినపుడు ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. అయితే కెరీర్ లో సినిమాలు వదులుకున్న కొంతమందికి అది వాళ్ళ కెరీర్ మీద ప్రభావం చూపదు. కానీ కొన్ని సార్లు కెరీర్ పోడానికి కారణం కూడా అవుతాయి. ఈ విషయం హీరో సుమంత్ ని చూస్తే అర్థమవుతుంది. ‘నువ్వేకావాలి, మనసంతా నువ్వే, ఇడియట్’ వంటి సినిమాలను వివిధ కారణాలతో వదులుకుని ఇపుడు కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి కష్టపడుతున్నాడు. కానీ కొంతమంది హీరోలకు మాత్రం అలా ఒకటి అరా సినిమాలను వదులుకున్నా కెరీర్ కి పెద్ద నష్టం కలగపోయినా, మంచి సినిమా నేను చేయలేదే అనే బాధ మాత్రం ఉండిపోతుంది. అలా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వదులుకున్న హిట్ సినిమాలలు ఏవో తెలుసా…

క్లాసికల్ హిట్స్ ని వదులుకున్న వెంకీ మామ…
ముప్పై ఐదేళ్ల కెరీర్ లో వెంకటేష్ ఎన్నో మంచి సినిమాలను చేసారు. కొన్ని కమర్షియల్ హిట్స్ అయితే కొన్ని కెరీర్ లో మైలురాళ్ళ వంటి చిత్రాలు చేసి ఎన్నో అవార్డ్స్ కూడా తెచ్చుకున్నారు. అలాంటి వెంకీ కెరీర్ లో బిజీగా ఉండటం చేతనో కథ నచ్చక పోవడమ వల్లనో కొన్ని సినిమాలను వదులుకున్నారు. అలాంటి వాటిలో మణిరత్నం క్లాసికల్ సినిమా ‘రోజా’ ఒకటి. రోజా అరవింద స్వామి, మధుబాల కాంబినేషన్ లో వచ్చిన దేశభక్తి సినిమా. ఇది ఇప్పటికీ క్లాసికల్ సినిమాగా ఉంది. అలాంటి సినిమా మొదట వెంకీ దగ్గరకే వచ్చినా ఏవో కారణాల వల్ల చేయలేక పోయాడట. ఇక మరో హిట్ సినిమా ‘ఒకేఒక్కడు’. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకేఒక్కడు అర్జున్ కెరీర్ లోనే ఒక. మంచి హిట్ సినిమా.

అలాంటి సినిమా మొదట విజయ్ దగ్గరికి, ఆయన బిజీగా ఉండటం తో వెంకటేష్ వద్దకు వెళ్లగా ఆయన బిజీగా ఉండటం వల్ల వదులుకున్నారు. ఇక మరో హిట్ చిత్రం ‘సంతోషం’ కూడా ఏవో కారణాలచేత వెంకీ వదులుకున్నాడు. ఇక కృష్ణవంశి ‘ఖడ్గం’ సినిమాలో శ్రీకాంత్ పాత్రకు మొదట వెంకటేష్ ను అనుకున్నా వేరే ప్రాజెక్ట్స్ వల్ల రిజెక్ట్ చేసాడట. ఇక ‘కృష్ణం వందే జగత్గురుమ్’ సినిమా కథ మొదట వెంకీ వద్దకు వచ్చినా ఆయన రిజెక్ట్ చేసారు, ఆయన ఆనందం కొరకు రానా చేసారు. ఇక ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో శ్రీకాంత్ పాత్ర కూడా మొదట వెంకీ నే అనుకున్నా రిజెక్ట్ చేసారు. ఇక కర్ణన్ సినిమా కథ నచ్చకపోవడంతో వెంకీ వద్దన్నుకున్నారు, ఆ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తీస్తున్నారు. అలా వెంకీ మంచి సినిమాలను బిజీగా ఉండటం వల్ల వదులు కున్నారు.



























