Damu Balaji : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ఇక ఈ విషయంలో అనేక చర్చలు నడుస్తున్నాయి. తెలుగు పాటకు ఆస్కార్ రావడం గర్వకారణంగా చాలా మంది భావిస్తుంటే ఆస్కార్ ని కొన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఎనభై కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు…
ఆస్కార్ ఒక ఇండియన్ పాటకు వచ్చిందని కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతుంటే మరి కొంతమంది మాత్రం ఆస్కార్ అవార్డును రాజమౌళి కొన్నాడు అంటూ కామెంట్స్ చేసారుడు. నిజంగానే ఆస్కార్ ను కొనే పరిస్థితి ఉందా అనే విషయం గురించి దాము బాలాజీ మాట్లాడుతూ ఆస్కార్ ను కొంటే ఇచ్చేంత వీలు ఉంటే రాజమౌళి కన్నా ముందు ఎంతో మంది కొనేవాళ్ళు, అపుడు ఆస్కార్ కు ఆ క్రెడిబులిటీ ఉండేది కాదు అంటూ చెప్పారు.

ఇక రాజమౌళి ఆస్కార్ రావడం కోసం అంత ఖర్చు చేసి ఉండవచ్చు కానీ అవార్డును కొనలేదు. సినిమాను అంతర్జాతీయ వేదిక మీద ప్రచారం చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు అంటూ ఆస్కార్ అవార్డును కొనే పరిస్థితి లేదు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ స్పష్టం చేసారు.

































