తాను కూడా జాత్యహంకారానికి గురయ్యానని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ తెలిపాడు. తానూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న సమయంలో తాను జాత్యహంకారానికి గురయ్యానని డారెన్ సమీ చెప్పాడు. “నేను ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం లో ఆడుతున్నప్పుడు అక్కడ వారు నన్ను మరియు శ్రీలంక మాజీ కెప్టెన్ తిసారా పెరెరాను వేరే పేరుతో పిలిచేవారు. అయితే ఆ పేరు అర్థం ఏమిటో కొద్దిరోజుల తరువాత నేను తెలుసుకున్నాను. వారు మా ఇద్దరినీ నల్లజాతి వ్యక్తి అనే పేరుతో పిలిచేవారు అని సమీ తెలిపాడు.

ఈ నేపథ్యంలో మరో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా తనకు ఎదురైనా జాత్యహంకార అనుభవాన్ని తెలిపాడు. క్రిస్ గేల్ మాట్లాడుతూ జాత్యాహంకారం అనేది కేవలం ఫుట్ బాల్ లో మాత్రమే కాదు, క్రికెట్ లో కూడా ఉంది అని తెలిపాడు. అదే క్రమంలో నలుపు చాలా శక్తివంతమైనది. నేను నల్లజాతి వాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది అంటూ తెలిపాడు క్రిస్ గేల్.




























