Darshanam Mogilayya : తెలంగాణలో 12 మెట్ల కిన్నెర వాయిద్యం వాయించే కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి కోటి రూపాయల నగదు, హైదరాబాద్ లో 300 గజాల స్థలం కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసారు. హైదరాబాద్ లోని బిఎన్ రెడ్డి నగర్ లో 300 గజాల స్థలం కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెర వాద్యం వాయించే కళాకారుడిగా కిన్నెర మొగిలయ్య గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తండ్రి దగ్గర నేర్చుకున్న కళను ఆపేయకుండా కొనసాగించి అదే జీవనోపాధిగా బ్రతికాడు.

నాకేంది లొల్లి అంటూ అక్రోషం…..
కిన్నెర మొగిలయ్యకు పేరొచ్చింది మాత్రం భీమ్లా నాయక్ సినిమాతోనే. భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో పౌర పురస్కారం పద్మశ్రీ గౌరవంతో సత్కరించింది.

అంతవరకు అంత బాగానే ఉన్నా తనను మొదట గుర్తించింది కెసిఆర్ ప్రభుత్వమే అంటూ చెప్పి నాకు పద్మశ్రీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమని రాజకీయం మొదలవడంతో నా పొట్టకొట్టకండి, నాకే పద్మశ్రీ అవసరం లేదు, నా ఉసురు పోసుకోకండి అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ఇపుడు కెసిఆర్ ప్రభుత్వం కోటి రూపాయల నగదు 300 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
































