Crime news: రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. క్షణకాలం సుఖం కోసం సొంతవాళ్లనే కడతేరుస్తున్నారు. వారి బంగారు జీవితాల్లో చీకటి నింపుకుంటున్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నవారు ప్రియుడి మోజులో పడి సొంత పిల్లలు, భర్తలను అత్యంత కిరాతకంగా చంపారనే వార్తలను చూస్తూనే ఉన్నాం. ఇక వావీవరసలు మరిచి విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమ సుఖానికి అడ్డుగా ఉన్నారని అడ్డు తొలగించుకుంటున్నారు. తాాగాజా ఇటాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కూతురు ప్రియుడితో కలిసి సొంత తల్లినే చంపేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తన సంతోషానికి అడ్డుగా ఉందని సొంత కూతరే కన్న తల్లిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు కొరటిగెరె పట్టణం సజ్జనర వీధిలో నివాసం సుమిత్ర(45)కు పెళ్లికాని కూతురు శైలజ ఉంది.

శైలజకు సోదరుడి వరసయ్యే దూరపు బంధువు పునీత్ తో పరిచయం ఏర్పడి అనైతిక సంబంధానికి దారి తీసింంది. ఇది తెలుసుకున్న శైలజ తల్లి సుమిత్ర పునీత్ ని తమ ఇంటి వైపు రావద్దని హెచ్చరించింది.
తల్లిని చంపి కొత్త డ్రామాకు తెరలేపింది..
తమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన శైలజ, తన ప్రియుడు పునీత్ తో కలిసి దారుణమైన నిర్ణయం తీసుకుంది. జనవరి 30న రాత్రి తల్లిని గొంతు పిసికి చంపేసింది. ఇంటి ముందు ఉన్న సంపులో పడేసింది. మరుసటి రోజు తల్లి అనుకోకుండా సంపులో జారి పడి చనిపోయిందని డ్రామాకు తెరలేపింది. అందరికి చెప్పి అంత్యక్రియలు కూడా జరిపింది. కొరటిగెరె పోలీసులకు ఎవరో ఈ కేసు గురించి చెప్పడంతో ఇద్దరిని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.



























