Deepika Padukone : మొన్నా మధ్య దీపికా సినిమా షూటింగ్ నుండి ఆసుపత్రికి తరలించబడింది. ఇక దీపికా వ్యక్తిగత సిబ్బంది రెగ్యులర్ చెక్ అప్ కోసం వెళ్లిందని వివరణ ఇచ్చారు. అయితే రకరకాల అనుమానాల నడుమ అసలు దీపికా ఎందుకు హాస్పిటల్ వెళ్ళింది అనే ప్రశ్నకు ప్రాజెక్ట్ కే ప్రొడ్యూసర్ అశ్విని దత్ వివరణ ఇచ్చారు. ప్రాజెక్ట్ కే అశ్వినిదత్ నిర్మాణం లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా నటిస్తోంది.

ఇక అమితాబ్ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుండగా దీపికా తనకు ఊపిరి సరిగా అందడం లేదని వెంటనే కామినేని హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ తరువాత మళ్ళీ సినిమా షూటింగ్ లో యధావిధిగా పాల్గొంది. అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో సన్నివేశాలలో నటించింది.
బీపీ సమస్యల వల్ల హాస్పిటల్ కి…

చిత్ర నిర్మాత మాట్లాడుతూ హైదరాబాద్‌లో తాను నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె సెట్స్‌లో దీపికా అసౌకర్యానికి గురైంది, వెంటనే హైదరాబాద్ లోనే ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె బిపి సంబంధిత సమస్యల కోసం కొన్ని ప్రాథమిక రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఈ వార్త దీపికా అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీపికా ఆసుపత్రికి వెళ్లడంపై వచ్చిన ఊహాగానాలను కొట్టిపారేశారు నిర్మాత అశ్విని దత్. ఇంతకుముందు దీపికా కోవిడ్‌తో బాధపడింది, కానీ కోలుకున్న తర్వాత యూరప్‌కు వెళ్లిపోయింది. ఇక యూరప్ నుండి, దీపికా నేరుగా ప్రాజెక్ట్ కే సినిమా సెట్స్‌పైకి వచ్చింది. ఇక దీపికా బిపిలో స్వల్ప హెచ్చుతగ్గుల అవ్వడం వల్ల కేవలం సాధారణ చెక్ అప్ కోసం మాత్రమే ఒక గంట పాటు హాస్పిటల్ కి వెళ్ళింది, ఇదంతా తన రెగ్యులర్ చెక్ అప్ లో భాగంగా మాత్రమే జరిగింది అని అశ్విని దత్ గారు ఈ విషయాన్ని క్లియర్ చేసారు.































