Deepika Ranganath: దీపికా రంగనాథ్ పరిచయం అవసరం లేని పేరు. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన దీపిక ప్రస్తుతం ఇతర సీరియల్స్ లో నటించకపోయిన వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ మానస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరియల్లో మానస్ భార్యగా దీపిక రంగనాథ్ నటించారు అయితే ఈ సీరియల్లో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇలా సీరియల్లో నటిస్తూనే మరోవైపు స్టార్ మా వేదికపై జరిగే పలు కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంటారు. అయితే ఈ కార్యక్రమాలలో దీపిక హంగామా చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. అయితే కొన్నిసార్లు ఈమె కామెడీ కాస్త ఓవర్ గా కూడా అనిపిస్తుందనే చెప్పాలి. సీరియల్స్ షూటింగ్ సమయంలో కూడా ఈమె ఎప్పుడు అందరితో ఇలా సరదా సరదాగా గడుపుతూ ఉంటారు. ఈమె అల్లరి పనులకు డైరెక్టర్లు సైతం ఇక చాలు ఆపవమ్మ తల్లి అంటూ దండాలు పెట్టేస్తుంటారు.
ఇలా అందరితోను సరదాగా గడుపుతూ అందరిని నవ్విస్తూనే ఉంటారు అలా నవ్వించడం తనకు ఇష్టమని పలు సందర్భాలలో దీపికా తెలిపారు. అయితే ఈమె నటిగా అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసమే అలా చేస్తూ ఉంటానని తెలిపారు. ఇక తాను చేసే కామెడీ అంతా అప్పటికప్పుడు ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారని ఎలాంటి స్క్రిప్ట్ కూడా ఉపయోగించారని తెలుస్తోంది.
ఇక కొన్ని సందర్భాలలో ఈమె చేసే అల్లరి పెద్ద ఎత్తున విమర్శలకు కూడా కారణం అవుతుంది పెద్ద ఎత్తున డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ విగ్గు తీసేసిన సన్నివేశాలను కూడా రీ క్రియేట్ చేయడంతో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇదంతా కూడా అందరిని నవ్వించడం కోసమే చేస్తానంటూ దీపిక చెప్పుకోవచ్చారు.
ఇలా ఎంతో చలాకీగా అందరిని నవ్విస్తూ ఉండే ఈమె ప్రస్తుతం చాలా పాపులర్ అయి ఉన్నారు. ఒకవైపు తమిళ సీరియల్స్ లోనూ మరోవైపు తెలుగు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు అయితే ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే దీపిక ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయాలపై కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఇక దీపిక ఒకరోజు షూటింగ్ లోకేషన్ లో కనుక ఉంటే 35 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈమె అంతలా ఓవర్గా రియాక్ట్ అవడానికి కారణం నటన పరంగా తనకున్న ఆసక్తి తన వల్ల ఇతరులు నవ్వుతూ సంతోషంగా ఉండటం తప్ప మరెలాంటి ఉద్దేశం లేదని తెలుస్తోంది.



























