సుశాంత్ కేసు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ది బలవాన్మరణం కాదు. అతడిని కావాలనే చంపేశారన్న నెగిటివ్ కామెంట్స్ రోజురోజుకూ స్ట్రాంగ్ గా వినబడున్నాయి. తాజాగా BJP రాజ్య సభ మెంబర్ సుబ్రమణ్యస్వామి సుశాంత్ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ.. సూశాంత్ ను కావాలనే చంపేశారని వాదిస్తూ.. తన ట్విటర్ ఖాతాలో కొన్ని ఆధారాలను బయట పెట్టి సంచలనం సృష్టించారు.

ఇందుకు ఉదాహరణగా రక్షణ శాఖ ఆర్డనెన్స్ హాస్పిటల్ లో పని చేసే డాక్టర్ మీనాక్షి మిత్రా వీడియోను తాజాగా సుబ్రమణ్య స్వామి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సుశాంత్ ది బలవాన్మరణం కాదని, అతడిని దారుణంగా కొట్టి చంపేశారని.. ఆ తర్వాత ఆ సంఘటనను ఉరివేసుకున్నట్టుగా చిత్రకరించారని, సుశాంత్ మృతదేహంపై ఉన్న గాయాలు, అతను మరణించిన తర్వాత తన గదిలో పడి ఉన్నతీరును విశ్లేషిస్తూ.. డాక్టర్ మీనాక్షి మిత్రా ఈ వీడియోలో సంచలన కామెంట్స్ చేశారు. ఇదిలావుండగా సుశాంత్ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై FIR ఫైల్ ను సిద్ధం చేసిన బీహార్ పోలీసులు ఈ కేసులో తమ స్పీడ్ ను పెంచారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసులు తమకు సహకరించడం లేదని.. ముంబైలో ఆటోలు, క్యాబ్స్‌లో తాము తిరుగుతున్నామని బీహార్ పోలీసులు తెలియ జేస్తున్నారు.

ఈ వివాదానికి సంబంధించి ముంబై – బీహార్ పోలీసుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సుశాంత్ మరణ మిస్టరీ వెనక పెద్ద కుట్రయే ఉందని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అన్ని నిజాలు బయటకి వస్తాయని సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు బీజీపీ MP సుబ్రమణ్య స్వామి, ఇతర నాయకులు తెలియజేస్తున్నారు. ఇదిలా వుండగా.. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం. ఇప్పటికే పాట్నా పోలీసులు సుశాంత్‌ సోదరి, మాజీ ప్రేయసి అంకితా లోఖండే, వంట మనిషి, అలాగే సుశాంత్ ఫ్రెండ్స్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. కానీ రియా చక్రవర్తి ఎక్కడ ఉందో ఇంకా గుర్తించక పోవడం కొంచెం ఆశ్చర్యకరమైన విషయమేనని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here