గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు ఒక ఫుట్‌బాల్ ప్లేయర్. యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్షిప్ లో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది క్రీడాలోకం. ఫిన్లాండ్ మరియు డెన్మార్క్ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో డెన్మార్క్ కు చెందినా ప్లేయర్ మిడ్ ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ ఉన్నట్టుండి మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆడియన్స్ తో పాటూ నిర్వాహకులు. దీనితో మ్యాచ్ మధ్యలోనే నిలిపివేశారు. కాగా.. ఎరిక్సన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఫుట్‌బాల్ లవర్స్. ఎరిక్సన్ ను స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























