Deputy Transport commissioner Paparao : పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొన్న కొత్తవాహనం వారాహి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చ ఈ వాహనం గురించే. ఆ వాహనం రంగు ఆర్మీ వాళ్ళ వాహనాల రంగు ఉండటం వల్ల ఆది ఎలా రిజిస్ట్రేషన్ చేసారంటూ వాదించారు చాలా మంది వైసీపీ నాయకులు. ఇక ఈ వివాదాల నడుమ ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ సవ్యంగా జరిగిందా అన్న విషయాల గురించి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు గారు వారాహి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

వారాహి నెంబర్ కి ఎంత చెల్లించారు…
పాపారావు గారు మాట్లాడుతూ అన్ని నిబంధనలకు లోబడే వారాహి రిజిస్ట్రేషన్ జరిగిందని ఏ తప్పులు జరగలేదని వివరించారు. వెహికల్ రంగు ఆర్మీ గ్రీన్ కదంటూ వివరించారు. ఎవరైనా ఏ వెహికల్ అయినా ఆర్మీ రంగు తీసుకోకూడదు అందుకు రిజిస్ట్రేషన్ నిబంధనలు ఒప్పుకోవు, రూల్ 21 ప్రకారం ఆలీవ్ గ్రీన్ కలర్ ఆర్మీ వాళ్లకు సంబంధించినది కావున ఆ రంగు వాడకూడదు. అయితే వారాహి వెహికల్ కి ఉన్న రంగు ఆలీవ్ గ్రీన్ కాదు అది ఎమ్రాల్డ్ గ్రీన్, అది స్పష్టంగా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది అంటూ పాపారావు గారు క్లారిటీ ఇచ్చారు.

ఇక పేరు వారాహి అంటూ ఏమి మెన్షన్ చేయలేదు రిజిస్ట్రేషన్ పత్రాల్లో అంటూ తెలిపారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రత్యేకమైంది కాకపోయినా అదే నెంబర్ కావాలన్నపుడు డబ్బు చెల్లించి తీసుకోవాలి. వారాహి నెంబర్ TS 13 EX 8384, ఈ సిరీస్ 8384 కోసం అదనంగా ఐదు వేలు చెల్లించారు అంటూ తెలిపారు పాపారావు. ఇక తెలంగాణ లో రిజిస్ట్రేషన్ జరిగిన వెహికల్ ఏపీ లో తిరిగినపుడు 30 రోజులకు టాక్స్ ఉండదు ఆ తరువాత ఆ స్టేట్ టాక్స్ కట్టాల్సి ఉంటుందంటూ తెలిపారు.



























