తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రేంజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ షో కి ఉన్న క్రేజ్ ఏ షో కి లేదు.. సీజన్ ల పరంగా వస్తున్న ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక నాల్గో సీజన్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ల అల్లరి మాత్రం తగ్గడమే లేదు. సోషల్ మీడియా లో వారు పెట్టె పోస్ట్ లు చూస్తుంటే ప్రేక్షకులు తమని మర్చిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అనిపిస్తుంది.

ఇక దేత్తడి హారిక కూడా సోషల్ మీడియా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ కి రాకముందు కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.. యూట్యూబ్ లో చాల బాగా పాపులర్ అయినా ఆమె ఆ పాపులారిటీ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది.. తాజగా ఆమె కి ఓ చేదు సంఘటన ఎదురైంది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా.. TSTDC బ్రాండ్ అంబాసిడర్‌గా హారికకు నియామక పత్రాన్ని అందించారు. కానీ మరుసటి రోజే తెలంగాణ పర్యాటక శాఖ ఆమె వివరాలను వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు సీఎంవో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ.. శ్రీనివాస్ గుప్తా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత మంత్రికి, సీఎంవోకు సమాచారం ఇవ్వకపోవడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణించింది. దీంతో ఈ విషయమై శ్రీనివాస్ గుప్తా నుంచి సీఎంవో అధికారులు వివరణ కోరినట్లు సమాచారం.



























