మూడు వారాల క్రితం బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడో వారం బిగ్ బాస్ షో నుంచి దేవి నాగవల్లి ఎలిమినేట్ అయింది. ఎవరూ ఊహించని విధంగా దేవి నాగవల్లి ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ షోపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బిగ్ బాస్ షోను ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓట్లు పడినా ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీరియస్ గా గేమ్ ఆడటమే దేవి చేసిన తప్పా…? అని ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో తొలివారం తనపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిందని.. అయితే తాను ఇంట్లో ఎలా ఉన్నానో బయట కూడా అలానే ఉన్నానని తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో డ్రామా ఉంటుందని తాను నిజంగా అనుకోలేదని చెప్పారు.
 
దేవి ఇతర కంటెస్టెంట్లపై ప్రభావం చూపించవచ్చని బిగ్ బాస్ నిర్వాహకులు భావించి ఉండవచ్చని.. రూల్స్ బ్రేక్ చేయని నేను బిగ్ బాస్ కు సారీ చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. బయటకు వచ్చిన తరువాత తనకు చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. తనలో నిజాయితీలో ఉన్నా లౌక్యం లేదని తన కంటే మెహబూబ్ కు తక్కువ ఓట్లు వచ్చాయని వెల్లడించారు.
 
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలామంది తన ఎలిమినేషన్ ను ఖండిస్తున్నారని.. నా బాధ బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైందని చెప్పారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం ఇస్తే తప్పకుండా వెళతానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here