Devi Sri Prasad: త్వరలోనే సింగర్ తో కలిసి ఏడడుగులు వేయబోతున్న దేవిశ్రీప్రసాద్… ఫోటో వైరల్!

0
47

Devi Sri Prasad: తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దేవిశ్రీ ప్రసాద్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇప్పటికీ ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు అయితే ఈయన పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో ఈయన ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక దేవి శ్రీ ప్రసాద్ త్వరలోనే తనకు వరసకు మరదలు అయ్యే అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకారం కూడా ఇచ్చారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా దేవిశ్రీప్రసాద్ కు సింగర్ ఇంద్రావతి చౌహన్ తో పెళ్లి జరగబోతోంది అంటూ ఓ వార్త సంచలనగా మారింది.

దేవిశ్రీ సంగీత సారథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ అనే పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు ఇంద్రావతి చౌహన్.అయితే దేవిశ్రీప్రసాద్ ఈమెతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనగా మారింది.అయితే వీరిద్దరి గురించి ఇలాంటి వార్త రావడానికి కారణం దేవి శ్రీ ప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఇంద్రావతి చౌహన్ ఆయనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడమే కారణం.

Devi Sri Prasad: ఇందులో నిజమెంత…


ఇలా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మరొక వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.అయితే ఈ వార్తలపై స్పందించిన కొందరు దేవి అభిమానులు ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ కొట్టి పారేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.