సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలించగా.. రైలు పట్టాలపై అతడి శవం కనిపించిన విషయం తెలిసిందే. అతడి చెయ్యిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండటంతో అతడే రాజు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే రాజును పోలీసులే హత్య చేశారని రాజు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో నిందితుడు రాజు ఆత్మహత్యపై DGP మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ‘రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు వద్దు.’ రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా ఏడుగురు చూసారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు, మరో ముగ్గురు రైతులు వీరితో పాటూ ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే వారి స్టేట్మెంట్ రికార్డు చేసాం. ఇక రాజు ఆత్మహత్యపై ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటేనే మాట్లాడండి’ అంటూ DGP స్పష్టం చేసారు.































