Dhanraj : ‘జై’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ధనరాజ్ ఆ తరువాత ‘జగడం’ సినిమాతో మొదటి సారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందర్ వంటి సినిమాలతో కెరీర్ స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఇక జబర్దస్త్ షో ధనరాజ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్ళింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ధనరాజ్ తెలుగులో మొదటి సారి మొదలయిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కాంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆరు వారాల తరువాత ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇక ఆ తరువాత మా టీవీ లో కామెడీ షో చేస్తూ ప్రస్తుతం ఒకవైపు సినిమాలను చేస్తూనే మరో వైపు కామెడీ షోలో చేస్తున్నారు. ఇక అప్పటి బిగ్ బాస్ ముచ్చట్లను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ధనరాజ్.

వారానికి అమౌంట్ ఇస్తారు… సంపూ విషయంలో జరిగింది అదే…
బిగ్ బాస్ లో రోజు లెక్క ఉండదు వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి వారానికి ఇంత అని ఇస్తారు అంటూ ధనరాజ్ చెప్పారు. ఇక వారానికి తనకు ఏడున్నర లక్షలు ఇచ్చేవారని అమౌంట్ నా భార్య అకౌంట్ లో పడేదని టాక్స్ కట్ చేసుకుని అంత అమౌంట్ ఇస్తారని చెప్పాడు. ఒకవేళ షో మధ్యలో వెళ్ళిపోతాం అని అంటే ఇరవై ఐదు లక్షలు బిగ్ బాస్ కు కట్టి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అయితే సంపూర్ణేశ్ బాబు బిగ్ బాస్ హౌస్ లో ఉండలేక మధ్యలో వెళ్ళిపోతాను అన్నపుడు ఇరవై ఐదు లక్షలు కట్టాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ గారు అతని బదులు నేను కడతాను ఇక్కడ ఉండలేక పోతున్నాడు పంపించేద్దాం ఇది నా మొదటి హోస్టింగ్ చేస్తున్న షో కంటెస్టెంట్ ఇబ్బంది పడకూడదు అని చెబితే యాజమాన్యం సంపూర్ణేశ్ బాబు తో ఏమి డబ్బులు తీసుకోకుండా పంపించారు అంటూ ధనరాజ్ చెప్పారు. షో స్క్రిప్టెడ్ కాదు వారానికి ఒకసారి కనిపించే హోస్ట్ తప్ప షోలో కొత్త మనుషులు కనిపించరు, సైకాలాజికల్ గా చాలా ఇబ్బంది పడ్డాము. నేను షో నుండి వెళ్ళిపోదామని అనుకున్నా కానీ ఇరవై ఐదు లక్షలు కట్టాలని ఆగిపోయాను అంటూ బిగ్ బాస్ వల్ల నాకేం మార్పు నా జీవితంలో రాలేదు, సినిమాలను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పారు.































