Dhanraj : మొదట సినిమాలలో నటించినప్పటికీ జబర్దస్త్ షో ద్వారా పాపులరిటీ సంపాదించుకున్న వారిలో ధన్ రాజ్ కూడా ఒకరు. జబర్దస్త్ లో ‘ధనాధన్ ధన్ రాజ్’ గా అభిమానులకు దగ్గర అయ్యాడు. ఆ తరువాత జబర్దస్త్ నుండి పక్కకు వెళ్లి, సొంతంగా సినిమా నిర్మించడంతో ఆర్థికంగా బాగా నష్టపోయాడు. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ బుల్లితెర మీద ఒక ప్రోగ్రాములో కూడా బిజీ గా ఉన్నారు. అయితే తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో ధన్ రాజ్ రావడం, స్టేజి మీద పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడటం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

షో మధ్యలో పవన్ కళ్యాణ్ కు ఫోన్…
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాముకు హాజరు అయిన ధన్ రాజ్ శుక్రవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీలో అయన గురించి తలుచుకున్నారు. ధన్ రాజ్ సినిమా రిలీజ్ అప్పుడు పవర్ స్టార్‌కు ఓ ట్వీట్ చేయడం జరిగిందట. అపుడు ఆ ట్వీట్‌కు ఆయన జవాబు కూడా ఇచ్చారని, అంతేకాకుండా సినిమా హిట్ కావాలని కోరుకున్నారని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

అయితే ఇంతలోనే ఆది కల్పించుకొని, మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎపుడైనా ఫోన్ లో మాట్లాడారా అని అడగడంతో, ధన్ రాజ్ షో మద్యలో ఫోన్ తీసుకొని ఎవరికో ఫోనే చేశారు. వెంటనే అటు వైపు నుండి హలో చెప్పండి ధన్ రాజ్ గారు… అంటూ పవన్ వాయిస్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారా… లేక రేటింగుల కోసం అలా చేశారో చూడాలి. ఈ సస్పెన్స్ పోవాలంటే సెప్టెంబర్ 4 వరకు ఆగాల్సిందే.



























