Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బాలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీలలో అగ్ర నటుడిగా కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న ధనుష్ తమ కొడుకే అంటూ మధురైకి చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు గత ఏడాది నవంబర్ నెలలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే ఆ దంపతులు తమ మూడవ సంతానమే ధనుష్ అని తనకు నటన అంటే ఇష్టం ఉండటంతో ఇంటిలో నుంచి పారిపోయి వచ్చాడని అయితే ప్రస్తుతం తాము వృద్ధాప్య దశకు వెళ్ళిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని తమ కొడుకు ధనుష్ ప్రతినెల 65,000 తమకు చెల్లించాలి అంటూ కోర్టును ఆశ్రయించారు.

ఇక ఈ విషయంపై స్పందించిన ధనుష్ తాను తమిళ దర్శకుడు కస్తూరి రాజా, విజయలక్ష్మీల సంతానమేనని కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలోనే కోర్టు డిఎన్ఏ పరీక్షకు హాజరు కావాల్సి ఉందని చెప్పడంతో ధనుష్ డీఎన్ఏ పరీక్షలకు నిరాకరించాడు.ఈ క్రమంలోనే తన జనన ధ్రువపత్రాలు కోర్టుకు సమర్పించడంతో ఈ పిటిషన్ కొట్టివేశారు.
పూర్తిగా అసత్య ప్రచారం…
ఈ క్రమంలోనే ధనుష్ మధురై దంపతులకు నోటీసులు పంపుతూ తన గురించి ఆ దంపతులు మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మీడియా ఎదుటకు వచ్చి నిజాలు చెప్పాలని లేని పక్షంలో పది కోట్ల రూపాయల పరువు నష్ట దావా చెల్లించాలని ఆ దంపతులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.మరి ఈ విషయంపై మధురై దంపతులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
































