Dhanush: కోలీవుడ్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలెంటెడ్ యాక్టర్ గా ధనుష్ కు పేరుంది. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ గెలుచుకున్నారు. తమిళంతో పాటు హిందీలో కూడా తన సత్తా చాటాడు. ప్రస్తుతం తెలుగులో కూడా నేరుగా సినిమా చేస్తున్నారు.

ఇటీవల తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాడు ధనుష్. తన భార్య, రజినీ కాంత్ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఇరువురు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ విషయం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే ధనుష్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఏకంగా రూ. 300 కోట్లతో సొంతిల్లు నిర్మించుకునే ప్లాన్ లో ఉన్నారు. ఇదే జరిగితే సౌత్ లోనే లగ్జరీ ఇల్లు ధనుష్ పేరుపైనే ఉంటుంది. ఐశ్వర్య రజినీ కాంత్ కు విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి హోటల్ లోనే ఉంటున్నారట ధనుష్. ప్రస్తుతం ఈ లగ్జరీ హౌజ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్ని రూపాయలతో ఇళ్లా అంటూ.. నోరెళ్లబెడుతున్నారు ధనుష్ ఫ్యాన్స్, నెటిజెన్లు.
సినిమాకు రూ. 50 కోట్లు తీసుకుంటున్న ధనుష్..
ఇదిలా ఉంటే వరసగా సినిమాలకు కమిట్ అవుతున్నారు ధనుష్. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ‘ సార్ ’ పేరుతో నేరుగా తెలుగు సినిమా చేస్తున్నారు.. దీంతో పాటు శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఇక తమిళంలో వరసగా కొన్ని ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ధనుష్ రూ. 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న రెండు సినిమాలతో దాదాపు రూ. 100 కోట్లు వెనకేయనున్నారు ధనుష్.



























